6 నెలలు సమ్మెలు, ఆందోళనలు చేయకుడదు
సమ్మె నిషేధిస్తూ జీవో నెం 2 విడుదల
అంగన వాడిలు సెక్షన్ 39 పరిధిలోకి
బాలాయపల్లి :-
పనికి సరిపడ్డా వేతనం ఇవ్వాలని గత 26 రోజులు నుంచి అంగన వాడిలు చేస్తున్నా ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయొద్దని ఆదేశాలు జారిచేయడం జరిగింది.జీతాలు గ్రాట్యుటీ పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు.ప్రభుత్వం దఫదఫాలుగా చర్చలు జరిపిన వారి డిమాండ్లపై పరిష్కార మార్గం చేపట్టలేకపోయింది. ఆర్థికభారం పడని వాటికి ఓకే చెప్పింది కానీ జీతాల పెంపుపై వారికి హామీ ఇవ్వలేదు. అందుకే అంగన్వాడీ వర్కర్లు సమ్మె విరమించడం లేదని
సమ్మె నిషేధిస్తూ జీవో నెం 2 విడుదల :-
అంగనవాడిలతో ప్రభుత్వం చర్చలు జరిపినా, బెదిరించినా సమ్మె విరమించడం లేదని ఇప్పుడు అంగన్వాడీల సేవలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో రిలీజ్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి సర్వీసుల్లో ఉన్న వారు ఆరు నెలల పాటు సమ్మెలు చేయకూడదని ఎస్మాని ప్రయోగించింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను రిలీజ్ చేసింది.ఇక ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం అంగన్వాడీల జీతాల్లో కూడా కోత పెట్టింది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు వేతనాల్లో మూడు వేలు తగ్గించి వారి వారి ఖాతాల్లో డబ్బు లు జమ చేసింది.
సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు :-
2013లో తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు వస్తారని ప్రభుత్వం వాదిస్తోంది.అందుకే అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగించిందో. ఈ ఎస్మాను 1981లో తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి సమ్మెలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంగన్వ�
డీలను విధుల నుంచి పూర్తిగా తోలగిం చ వచ్చు.ఇక వారిపై చట్టపరమైన చర్యలు తీసు కొని కేసులు పెట్టవచ్చు. ఈ కేసుల్లో సమ్మెచేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష విదించ వచ్చు, అంతేకాకుండ సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ఫోటో:- సమ్మే చేస్తున్న అంగన్వాడీలు