బాలాయపల్లి :-
అంగన్వాడి కార్యకర్తలు,హెల్పర్లు శనివారం నుంచి విధులకు హాజరు కాకపోతే ఏకపరమైన చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ సిడిపిఓ శంషాద్ బేగం పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని 72 అంగన్వాడి కార్యాలయాలకు అంగ న్వాడీలు విధులకు హాజరుకావాలని నోటీసులు కర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద పిల్లలు పౌష్టికాహారం లేక అల్లాడిపోతున్నారు విధులకు హాజరు కాని వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంతేకాకుండా పోస్టుల ద్వారా ప్రతి అంగనవాడి కార్యకర్తకు హెల్పర్లకు నోటీసులు పంపడం జరిగిందన్నారు.
శనివారం నుంచి అంగన్వాడీ కార్యాలు నిర్వహించి పోతే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పోలమ్మ రాజేశ్వరి తదితరులు ఉన్నారు.
ఫోటో:- నోటీసులు అంటిస్తున్న సిడిపిఓ