మార్వెల్ స్టూడియోస్ లేటెస్ట్ సినిమా ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్గా దీన్ని తెరకెక్కించారు. మొదటి భాగం ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ సాధించడం విశేషం. మొదటి భాగం అయిన ‘బ్లాక్ పాంథర్’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. వసూళ్ల పరంగా చూసుకున్నప్పటికీ అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు ఎంత శాతం లాభాన్ని తెచ్చాయో ‘బ్లాక్ పాంథర్’ కూడా దాదాపుగా అంతే లాభాన్ని తీసుకువచ్చింది. దీంతో సీక్వెల్గా వస్తున్న ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలో హీరోగా నటించిన చాడ్విక్ బోస్మన్ ఆ తర్వాత క్యాన్సర్తో మరణించారు. అతనికి నివాళిగా ఈ సినిమాను మార్వెల్ రూపొందించింది. బ్లాక్ పాంథర్ లేకపోవడంతో వకాండా దేశంలో మాత్రమే లభించే అరుదైన, శక్తివంతమైన లోహం వైబ్రేనియం ఆధారంగా తీసిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెకక్షన్లను రాబడుతోంది.