అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గత రెండు దశాబ్దాలుగా పని చేస్తూనే ఉంది. దాని
అంచనా జీవితకాలం 15 సంవత్సరాలు మించిపోయింది. దీంతో ఇక దానిని తొలగించాలని
నాసా ఆలోచన చేస్తోంది. అందుకని 2030 నాటికి ISSని రిటైర్ చేయడానికి NASA
కొత్త ప్రణాళికను సిధ్దం చేస్తోంది. “స్పేస్ టగ్”ని ఉపయోగించి దానిని
నిర్వీర్యం చేసి, ఆపై పాయింట్ నెమో అని పిలువబడే భూమి యొక్క వాతావరణంలో
సురక్షితమైన ప్రదేశంలో ISS కాలిపోయేలా చేస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యోమనౌకను
ఉపయోగించడం దీనికోసం ప్రస్తుత ప్రణాళికగా చెబుతున్నారు. రష్యాస్ ప్రోగ్రెస్
అనే ప్రోగ్రెస్ వెహికల్స్‌తో ఎలా సురక్షితంగా డిఆర్బిట్ చేయాలనే దానిపై తాము
రష్యన్ సహచరులతో కలిసి పని చేస్తూనే ఉన్నామని NASA తెలిపింది.అయితే ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి యుఎస్ మరియు రష్యా మధ్య దౌత్య
సంబంధాలు క్షీణించాయి. అయినప్పటికీ అంతరిక్షం విషయంలో రెండు దేశాలు
సహకరించుకునేలా చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. రష్యా కూడా అంతర్జాతీయ
అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగాలని చూస్తోంది. రష్యాకు చెందిన రోస్కోస్మోస్
2024 తర్వాత ISS నుండి వైదొలగుతుందని ప్రకటించింది.