అందం పెంచు కోవడానికి సర్జరీలు చేయించు క కోవడం అధికంగా వ్యాపిస్తోంది. ఇందులో
సినిమా తారలు సెలబ్రిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. మరో వైపు అభిమానులు ప్రధానంగా
యువత వారిని ఫాలో అవుతుండటం గమనార్హం. అకారణంగా సర్జరీలను ఆశ్రయించడం
ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులారిటీ అందుకున్న అందాల భామ
కిమ్ కర్డాషియన్. అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు, శరీర ఆకృతి,
తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం
చేసుకుంది.కిమ్ కర్డాషియన్ లా వయ్యారం ఒలకబోయాలని, ఆమెలా కనిపించాలని అనేకమంది అమ్మాయిలు
తహతహలాడుతుంటారు. కొందరు ఓ అడుగు ముందుకేసి ప్లాస్టిక్ సర్జరీలు కూడా
చేయించుకున్నారు. అమెరికాకు చెందిన క్రిస్టినా ఆష్టన్ గౌర్కానీ కూడా ఈ కోవలోకే
వస్తుంది.

గౌర్కానీ స్వస్థలం కాలిఫోర్నియా. మోడలింగ్ ద్వారా అనేకమంది అభిమానులను
సంపాదించుకుంది. పలు సర్జరీల అనంతరం అచ్చం కిమ్ కర్డాషియన్ లా ఉందే
అనిపించుకుని మురిసిపోయింది. కిమ్ కర్డాషియన్ ను పోలి ఉండడంతో ఆమెకు మరింత
ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమలో 34 ఏళ్ల గౌర్కానీ… మరో సర్జరీ
చేయించుకుని, అది వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది.
ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం గౌర్కానీ
తీవ్ర గుండెపోటుకు గురైందని, ఆమె మరణానికి కారణం అదేనని తెలిపారు. సర్జరీ
నేపథ్యంలో, గుండె పనితీరుకు అవాంతరాలు ఏర్పడ్డాయని, గుండె ఆరోగ్యం
క్షీణించడానికి నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కారణమని మేయో క్లినిక్ వర్గాలు
వెల్లడించాయి.