ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ
కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం
అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు
తెలుసుకునేందుకు చంద్రయాన్ -1ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ –
2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019 న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా
ప్రవేశపెట్టారు కానీ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా,
ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయింది. అయితే, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ
విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కూడుకున్న మిషన్లకు
పేరుపొందిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ -3తో మరోసారి
చంద్రుడిపైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
నీటి మొత్తాన్ని ఆవిరి రూపంలో ఉన్న ట్రేస్ గుర్తించి చంద్రయాన్ -1తో అపారమైన
విజయాన్ని సాధించింది. అందుకే మరోసారి చంద్రయాన్ -3తో చంద్రుని ఉపరితలంపై
మరింత అధ్యయనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బిలియన్ సంవత్సరాలలో
సూర్యరశ్మిని చూడని చంద్రుని చీకటి వైపు దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మంచు,
విస్తారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని పరిశోధకులు నమ్ముతారు. చంద్రుడి నిగూఢ
రహస్యాలు ఛేదించడానికి ఇస్రో చేపట్టిన మూడో ప్రయోగం ఇది.
చంద్రయాన్ – 3 ఎందుకు?
ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ..అగ్రదేశాల జాబితాల్లో చేరిపోయింది భారత్. సాంకేతిక
పరంగా పరంగా ఎన్నో వినూత్న ప్రయోగాలకు చిరునామా ఇస్రో చిరునామాగా నిలుస్తుంది.
ముఖ్యంగా అంతరిక్ష రంగంలో భారత్ చేస్తున్న ప్రయోగాలకు అన్ని దేశాలు ఫిదా
అవుతున్నాయి. ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ఘనతను సాధించనుంది.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని చేరుకోనుంది.
చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్
లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని
పంపనున్నారు. దీనికోసం ఇస్రో అన్ని ప్రయత్నాలు చేసి, నేడు ఈ స్పేస్
క్రాఫ్ట్ను ప్రయోగించబోతుంది. ఇది 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని
కొనసాగిస్తుంది. ఇది ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్
అవుతుంది. దీనికోసం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3ని
వినియోగించనుంది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చంద్రయాన్-2 కంటే తక్కువ
ఖర్చుతో ప్రయోగిస్తుంది. దీనికి కారణం చంద్రయాన్-2లో పంపిన ఆర్బిటర్ ఇప్పిటికి
విజయవంతంగా కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని చాలా వరకూ స్కాన్ చేసి
విలువైన సమాచారాన్ని భూమికి పంపించింది. ఈ ఆర్బిటర్ జీవితకాలం ఏడున్నరేళ్లు
అని ఇస్రో నిర్ధారించింది. ఆ ఆర్బిటర్ ఇప్పటికి విజయవంతంగా సేవలు అందించడంతో
చంద్రయాన్-3 ప్రయోగంలో ఆర్బిటర్ పంపించడం లేదు. చంద్రయాన్-2లో పంపించిన
ఆర్బిటర్నే దీనికి ఉపయోగించుకోనున్నారు.