ఉక్రెయిన్ పై యుద్ధ రీతిని రష్యా మార్చివేసింది. ఇంతకాలం నాటో దేశాల సహాయంతో
ఉక్రెయిన్ ప్రతిదాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన
నూతనవార్ ప్లాన్ అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా
దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్
‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. శీతాకాలం
కాబట్టి సైనికులు తూర్పు ఉక్రెయిన్‌లో ట్రెంచ్ ఫుట్‌తో పోరాడుతున్నారు.
తూర్పున ఉన్న డోన్బాస్లో చలి వాతావరణం, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ
రష్యన్లు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ
దెబ్బతింది. అయితే మరోవైపు విద్యుత్ పునరుద్ధరించే చర్యలను చేపట్టినా
మరికొన్నిరోజుల వరకు ఉక్రెయిన్ అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఒకవేళ విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించినా.. రష్యా మళ్లీ దాడులు
చేయదనే గ్యారెంటీ లేదు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.