అంధేరీ ఉప ఎన్నికలో ఉద్ధవ్ నేతృత్వంలోని సేనకు చెందిన రుతుజా లట్కే విజయం సాధించి నోటా రెండో స్థానంలో నిలిచారు.
మహారాష్ట్రలో అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఆరు రౌండ్లు ముగిసేసరికి ఉద్ధవ్థాకరే వర్గం శివసేన అభ్యర్థి రుతుజా లట్కేకు 24,995 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 4,712 ఓట్లతో నోటా రెండో స్థానంలో ఉన్నది. అంటే నోటాపై రుతుజా లట్కే 20,283 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంధేరి ఈస్ట్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణంతో ఉద్ధవ్ థాకరే ఆ స్థానంలో ఆయన సతీమణి రుతుజాను బరిలో దించారు. ముందుగా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మజీతియా బరిలో నిలిచారు. ఆయనకు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన మద్దతు ప్రకటించింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ తన అభ్యర్థి నుంచి పోటీ నుంచి ఉపసంహరించుకుంది. దాంతో అక్కడ రుతుజా లట్కేకు నోటాకు మధ్య మాత్రమే ప్రధాన పోటీ నెలకొంది. మిగతా అభ్యర్థులెవరికీ ఇప్పటివరకు 1000 ఓట్లు కూడా రాలేదు.