విజయవాడ : భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమం, దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న గొప్ప కార్యక్రమం అని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు మమ్మల్ని అవమానించారు. మా దేవుడ్ని అవమానించారు. మాపై దాడులు, అమానుషాలు చేయించారు, అంబేద్కర్ విగ్రహం పెడతామని అవమానించారు, కానీ మీ పాలనలో దళితులు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా బతుకుతున్నారు, అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ వ్యవస్ధ తెచ్చారు, మా కులాల స్ధితిగతులు మార్చారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు అంబేద్కర్ గారిని మీ గుండెల్లో, మీ కుటుంబంలో ఒకరిగా చేసుకున్నారు, దేశంలో ఉన్న దళితులకు మీరు గుండె నిబ్బరం ఇచ్చారు, విజయవాడలో కొండ మీద అమ్మవారు అయితే కొండ కింద అంబేద్కర్ గారిని పెట్టారు, మీ రుణం తీర్చుకుంటాం అన్నా, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా మన జగనన్నను ఆశీర్వదించాలన్నారు. జగనన్న అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదని కొన్ని పత్రికలు రాశాయి, మేం చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో అంబేద్కరిజాన్ని, దేశంలో అంబేద్కరిజాన్ని మోసిన ఏకైక సీఎం జగన్, అంబేద్కర్ భావజాలంతో పని చేస్తున్న సీఎం మన జగనన్న, మేమంతా మీకు రుణపడి ఉంటాం అన్నారు.