విజయవాడ : అంబేద్కర్ గురించి ఇంత చేసిన సీఎం దేశంలో లేరని హోంశాఖా మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ రోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ జరుగుతుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన మహా శిల్పాన్ని రూపొందించడం..ఇందులో తనకు అవకాశం కల్పించిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, పోరాటాల గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదివామని, కానీ అవి అమలుచేసిన చరిత్ర మన సీఎందన్నారు. ఆయన సిద్దాంతాలు, ఆశయాలు, ఆలోచనలు, సంస్కరణలు, పోరాటాలు జగనన్న ముందుకు తీసుకెళ్తున్నారని, మనమంతా కూడా జగనన్నకు అండగా ఉండాలని, తోడుగా ఉండాలని కోరారు.