సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ 20:
సైదాపురం మండలం లోని తుమ్మల తలు పూరు లోని పురాతన తిప్ప తో పాటు పట్టా భూములు లో ఓరుపల్లి చెరువు లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దోపిడీ అధికారుల కను సైగలో సాగే అధికార పార్టీ మాఫియా దేనికి సంకేతం అని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ సైదాపురం మండలం లో ఒకటిన్నర ఏళ్ళ నుండి అధికార పార్టీ లో నీ మైనింగ్ మాఫియా అడ్డ దారులు తొక్కి కోట్ల రూపాయల ను దోచుకు పోతోందని ఆరోపించారు.భవిషత్తు తరాలకు కూడా జీవనోపాధి దొరక కుండా ఖనిజ సంపద కనుచూపు మేరలో లేకుండా చేస్తున్నారని విమర్శించారు.గ్రామాలలో ప్రజా ప్రతినిదులు సర్పంచ్ లు ఎం పి టి సి లు మౌనం వెనుక కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజలు తిరగబడి పోరాడ కుంటే ఖనిజ సంపద మన దేశానికి అవసరసమయంలో కూడా దొరక కుండా పోతుందని ఆయన అరోపించారు.ఇప్పటి కైనా అధికారులు పార్టీలకు అతీతంగా కళ్ళు తెరిచి ఖనిజ సంపదను కాపాడు కోవాలని ఆయన కోరారు. కార్యక్రమం లో ఐ ఎఫ్ టి యు నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్, ఐ ఎఫ్ టియు నాయకులు పి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.