ఫౌండేషన్ యొక్క సెంట్రలైజడ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ప్రముఖ క్రికెటర్
అంబటి తిరుపతి రాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ
మధ్యాహ్న భోజనం పధకమైన “జగనన్న గోరుముద్ద పథకం” ద్వారా 30,000 మంది పిల్లలకు
ఇక్కడి నుండి ద్వారా దాదాపు 25 వాహనాలతో ఇన్సులేటెడ్ కంటైనర్లలో ప్రభుత్వ
పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది
లాభాపేక్ష లేని సంస్థ, ఇది భారతదేశంలో మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లల పోషకాహార
లోపాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ-సహాయక పాఠశాలల్లో
మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ద్వారా, అక్షయపాత్ర ఆకలిని పోగొట్టడం
మరియు ప్రతిరోజు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుందన్నారు.
భారత, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో, అనేక మంది దాతల మద్దతుతో, అక్షయ
పాత్ర నిరాడంబరమైన ప్రారంభం నుండి పిల్లలకు సేవలందిస్తూ ఈ రోజు ప్రపంచంలోనే
అతిపెద్ద స్థాయికి ఎదిగింది అని అన్నారు. ఇక్కడకు రావటం చాల సంతోషమగా
ఉందన్నారు అలాగే తన వంతు సహాయం కూడా చేస్తానని అన్నారు . ఈ సందర్భంగా అక్షయ
పాత్ర మంగళగిరి ప్రెసిడెంట్ వంశీధర దాస మాట్లాడుతూ ఆచార్యులు జగద్గురు
ప్రభుపాదుల వారి ఆశయాలతో 1500 మందితో ప్రారంభమైన మధ్యాహ్న భోజన కార్యక్రమం
ద్వారా అక్షయ పాత్ర ఈరోజు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత
ప్రాంతంలోని దాదాపు 20,000 పైగా పాఠశాలల 22 లక్షల పైగా పిల్లలకు ప్రతిరోజు
ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోంది. అదే సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకు
రావడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు అక్షయ
పాత్రకు వచ్చి మమ్ములను ప్రోత్సాహించి నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య
క్రమంలో విలాస విగ్రహ దాస, అక్షయ పాత్ర సిబ్బంది పాల్గొన్నారు.