పీఎస్ఎల్వీ-సీ54 రిహార్సల్ సక్సెస్
తొమ్మిది ఉపగ్రహాలతో ఎల్లుండి నింగిలోకి
భారతదేశం అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం
ద్వీపం నుంచి ఈ మధ్యంతర ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
తొమ్మిది ఉపగ్రహాలతో ఎల్లుండి నింగిలోకి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 26న
ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
(షార్) నుంచి పీఎ్సఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం జరపడానికి శాస్త్రవేత్తలు
సర్వం సిద్ధం చేశారు. బుధవారం రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు.
రాకెట్‌ను మొబైల్ సర్వీసు టవర్ నుంచి ముందుకు తీసుకెళ్లి మళ్లీ వెనక్కి
తెచ్చారు. గురువారం ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ
(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించ నున్నారు. ఆ తర్వాత లాంచింగ్ ఆథరైజేషన్
బోర్డు (ల్యాబ్) సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. షార్‌లోని
మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. మన దేశానికి చెందిన 960
కిలోల ఓషన్‌శాట్-3 (ఈవోఎస్-06) ఉపగ్రహంతోపాటు మరో 8 ఉపగ్రహాలను రోదసిలోకి
పంపనున్నారు. భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్,
పిక్సెల్ సంస్థ తయారు చేసిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన
రెండు తైబోల్డ్ శాట్లు, అలాగే అమెరికాలోని స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన
నాలుగు అస్ర్టోకాస్ట్ ఉపగ్రహాలను ఈ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి
పంపనున్నారు. రాకెట్ నాలుగో దశలో ఉపగ్రహాన్ని అమర్చి దాని చుట్టూ ఉష్ణకవచం
(హీట్‌షీల్డ్) అమర్చే ప్రక్రియ పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు.