బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి
విజయవాడ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి
వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు
దగ్గుబాటి పురందేశ్వరి అటల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ అటల్ జీవితం దేశ సేవకు అంకితమయ్యారన్నారు. అటల్
జీవితం బీజేపీ కార్యకర్తకు దిక్సూచిలాంటిదని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు
చేసిన ధీరోధాత్తుడు అని కొనియాడారు. దేశం ఎదుర్కొన్న అతి పెద్ద బానిసత్వానికి
వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. చాలా పిన్న వయస్సులోనే
సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేటి యువత అటల్ స్ఫూర్తితో పని చేయాలని
పిలుపునిచ్చారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత అటల్ దే అని
చెప్పుకొచ్చారు. సుపరిపాలన అంటే అటల్ గుర్తొస్తారన్నారు. అటల్ చూపిన మార్గంలో
నడుస్తామని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.