హైదరాబాద్ : రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో 74వ గణతంత్ర
దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో అటవీ
సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ జాతీయ
జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం వేళ ప్రతీ ఒక్కరూ సరిహద్దుల్లో వీర
జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని, వారి స్ఫూర్తితో అభివృద్దికి పునరంకితం
కావాలని కోరారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు
హరితహారం నేడు దేశ వ్యాప్త ప్రశంసలు అందుకుంటోందని, ఈ పథకం విజయవంతంలో అటవీ
శాఖలో పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ భాగస్వామ్యం ఉందని పీసీసీఎఫ్ అన్నారు.
అడవుల రక్షణ విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని
కోరారు. ఈ సందర్భంగా గత యేడాది కాలంలో పనితీరులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న
అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకాలను అందించారు.