మిద్దెపల్లి-ఎద్దుపెంట రహదారిని ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్
ఎద్దుపెంటలో రైతులకు వ్యవసాయ పనిముట్లు,రాయితీ విత్తన పంపిణీ
నక్కలాగుపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి బుగ్గన
గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ
ఆలయ నిర్మాణ పనులకు ఆగస్ట్ 15 తేదీ తుది గడువుగా మంత్రి ఆదేశం
డోన్ పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి
అనారోగ్యంతో పాలైన తాడూరు లచ్చన్న ఇంటికి వెళ్లి ‘నేనున్నాంటూ’ భరోసా
ఉంగరానిగుండ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో నవదంపతులకు
ఆశీర్వాదం
డోన్ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో తన సొంత డోన్
నియోజకవర్గం రహదారులతో కళకళలాడుతోంది. వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో
నియోజకవర్గంలోని మూరుమూలలకు సైతం రహదారులను నిర్మిస్తూ అభివృద్ధి దిశగా
అడుగులేస్తున్నారు. ఆదివారం డోన్ మండలంలోని మిద్దెపల్లి నుంచి ఎద్దుపెంట వరకూ
3.8 కి.మీ మేర నిర్మించిన రహదారిని ఆదివారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ప్రారంభించారు. గతంలో అధ్వానంగా ఉన్న రోడ్డు ఇబ్బందులను స్థానిక ప్రజలు మంత్రి
దృష్టికి తీసుకురావడంతో రూ.2.50 కోట్లు వెంటనే మంజూరు చేయించి ..రహదారి
నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. కొత్త రోడ్డుపై మిద్దెపల్లి,
ఎద్దుపెంట ప్రజలతో కలిసి పాదయాత్ర చేశారు. పాదయాత్రగా ప్రజలతో కలిసి ముందుకు
సాగుతున్న మంత్రి బుగ్గనను పొలంలోని కూలీలు ఆప్యాయంగా పలకరించారు.
మిద్దేపల్లిలో ఓ వికలాంగుడైన యువకుడి ఇంటి వద్దకు వెళ్లి మంత్రి పలకరించారు.
అతను అడిగిన వినతులపై మంత్రి బుగ్గన సానుకూలంగా స్పందించారు. అనంతరం
నిర్వహించిన సమావేశంలో డోన్ మండలంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు
వివరించారు.చదువుకోవాలనే ఆసక్తి కలిగిన ఏ ఆడపిల్లా పైసా ఖర్చు లేకుండా
విద్యనభ్యసించే విధంగా రూ.40 కోట్లతో బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయం
నిర్మిస్తున్నామన్నారు. డోన్ లో 100 పడకల ఆస్పత్రి పూర్తయితే యావత్
నియోజకవర్గ ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇబ్బంది లేని గొప్ప భాగ్యంగా
మారబోతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
అందుబాటులోకి వచ్చి అందులో శిక్షణ పూర్తయితే డోన్ యువతకు రూ.25 నుంచి 30 వేల
జీతంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.50 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లాకే
ప్రసిద్ధి చెందిన ప్యాపిలి మార్కెట్ ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు
చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుండాల చెన్నకేశవస్వామి ఆలయ పునరుద్ధరణ కోసం రూ.5
కోట్లకు పైగా ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు. అందులో రాజ గోపురానికి మాత్రమే
రూ.2కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ,
విద్యాదీవెన,వసతి దీవెన,జగనన్న చేయూత వంటి పథకాలను అమలు చేస్తూ ఆడపడచులకు
అన్ని విధాల ఆర్థిక పరిపుష్ఠిని కలిగిస్తున్నామన్నారు. ఉద్దానం, పులివెందుల
తర్వాత వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేస్తుంది ఒక్క డోన్ నియోజకవర్గంలోనేని
మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు.
అబ్బిరెడ్డి పల్లెలో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవన్నీ
అభివృద్ధి అవునో కాదో ప్రతిపక్షాలకు తెలియదా అన్నారు. ఈ సందర్భంగా ఎద్దుపెంట
సహా పలు గ్రామాల రైతులకు వ్యవసాయ పనిముట్లను మంత్రి బుగ్గన పంపిణీ చేశారు.
సుమారు రే.25 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్లను అందజేశారు. రాయితీపై విత్తన
కార్యక్రమాన్ని మంత్రి బుగ్గన ప్రారంభించారు.
2014లో తెలుగుదేశం పార్టీ రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ
పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. రెండో సారి ఎమ్మెల్యే అయిన తనపై టీడీపీ నేత
నారా లోకేశ్ అర్థం మాటలు మాట్లాడారన్నారు. రెండో విడత గెలిపించినా అభివృద్ధి
చేయలేదని ఆరోపించినందుకు మంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు. 14 ఏళ్లు
ముఖ్యమంత్రిగా, ఐదేళ్లు ప్రతిపక్షనేతగా , 5 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలిచిన
చంద్రబాబు నియోజకవర్గంలో ఎందుకు తాగునీటి సమస్య పరిష్కరించలేదో చెప్పాలని
మంత్రి సూటిగా ప్రశ్నించారు. గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను
మంత్రి పర్యవేక్షించారు. ఏడాది కావస్తున్నా పనులు నెమ్మదిగా జరగడం
తగదని..ఆగస్ట్ 15 కల్లా ఆలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులు, కాంట్రాక్టర్
ను ఆదేశించారు. ఏ కట్టడం ఎలా ఉండాలో సూచనలిచ్చారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ
గుడి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఆలయంలోని కల్యాణ
మండపం,అమ్మవారి గుడి సహా గుడి ప్రాంగణమంతా పరిశీలించి పలు ఆదేశాలిచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో శ్రమించి ..ఇటీవల అనారోగ్యంతో మంచాన
ఉన్న కార్యకర్త తాడూరు లచ్చన్నను మంత్రి బుగ్గన స్వయంగా ఇంటికి వెళ్లి చూశారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి యజమాని
అలా కదలకుండా మంచాన ఉన్న పరిస్థితిని వివరిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా
ఘొల్లుమని విలపించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భావోద్వేగానికి లోనయ్యారు.
నేనున్నానంటూ కుటుంబాన్ని ఓదార్చారు. ఏ సాయం కావాలన్న తానున్నానని..కంటికి
రెప్పలా లచ్చన్నను చూసుకోవాలని కోరారు.
ఉంగరాని గుండ్లలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వైసీపీ నాయకుడు చిన్నమద్ది
ఇంటికి వెళ్లి కలిశారు. ఇటీవల చిన్నమద్ది కుమారుడి వివాహానికి హాజరలేకపోవడంతో
ఇపుడు ప్రత్యేకంగా వెళ్లి వధూవరులను అక్షింతలు వేసి మంత్రి ఆశీర్వదించారు.
అంతకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆర్థిక
శాఖ మంత్రి బుగ్గన ఆవిష్కరించారు. గతంలో వైఎస్ నగర్ కూడలి వద్ద పట్టణంలోకి
వచ్చే ముందు ఉన్న విగ్రహాన్ని సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం తొలగించి.ఇపుడు
డోన్ పట్టణంలోని జాతీయ రహదారి బాలాజీ హోటల్ వద్ద కంబాలపాడు సర్కిల్ లో
పున:ప్రతిష్టించిన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు,డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల
రాజశేఖర్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్ కుమార్,
ఆర్డీవో వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.