తాగడం సరైనదే కానీ, ఎక్కువగా టీలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే
అవకాశం ఉంది.
ఐరన్ లోపం:
టీలో కెఫిన్, టానిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణమైన ఆహారం నుంచి ఐరన్
శోషణను తగ్గిస్తాయి. దీంతో ఐరన్ లోపం సమస్య వస్తుంది. ఇది రక్తహీనతకు కారణం
అయ్యే అవకాశం ఉంది.
నిద్ర లేమి:
ఎక్కువగా టీ తాగడంతో నిద్రలేమి సమస్యలు అధికం అవుతాయి. టీ తాగడంతో మెలటోనిన్
స్థాయిలు స్థిరంగా ఉండవు. దీంతో నిద్ర లేమి, ఊబకాయం, డయాబెటిస్ వచ్చే అవకాశం
ఉంది.
మానసిక సమస్యలు:
ఎక్కువగా టీ తాగడంతో మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలసట ఎక్కువగా ఉంటుంది.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది.
మంట:
కెఫిన్ గుండెల్లో మంటకు కారణం అవుతుంది. ఎక్కువగా కాఫీ తాగడంతో యాసిడ్
రిఫ్లెక్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కెఫిన్ అన్న వాహికను వేరుచేసే స్పింక్టర్
ను దెబ్బతీస్తుంది.
తలనొప్పి:
టీ ఎక్కువగా తాగేవారిలో తలనొప్పి అధికంగా ఉంటుంది. కాఫీతో పోల్చుకుంటే టీలో
కెఫిన్ తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రమాదమే. ఒక కప్పు టీలో సుమారు 60
ఎంజీ కెఫిన్ ఉంటుంది.
మైకం:
టీలు ఎక్కువగా తాగేవారిలో మైకం వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజుకు 400
నుంచి 500 ఎంజీల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకుంటే మైకం వస్తుంది.