న్యూఢిల్లీ : అదానీ అక్రమాలపై ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రంలోని
నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ
గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం
వెంటనే విచారణ జరపాలని పలు రాష్ర్టాల్లో బీజేపీ కార్యాలయాల ఎదుట ఆందోళన
నిర్వహించింది. ముఖ్యంగా చండీగఢ్, కోల్‌కతాలలో పెద్దఎత్తున నిరసనలు
చేపట్టింది.చండీగఢ్‌లో ఆందోళనకారులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. రాజధాని ఢిల్లీలోని
బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆప్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అదానీ
అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి దర్యాప్తు
చేపట్టాల్సిందేనని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ డిమాండ్ చేశారు.