పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటున్నది అగ్ర కథానాయిక కాజల్
అగర్వాల్. తాజాగా ఆమె ఇన్ స్ట్రా గ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. తన
కుమారుడు నీల్ సమక్షంలో సరికొత్త ప్రపందాన్ని చూస్తున్నానని కాజల్ అగర్వాల్
ఆనందం వ్యక్తం చేసింది. తాను ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులే బాబు
బాధ్యతలు తీసుకుంటున్నారని, దాంతో తాను వృత్తికి సమయాన్ని
కేటాయించగలుగుతున్నాడని పేర్కొంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని
బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద సవాల్ అని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడింది. ప్రసవం
తర్వాత తాను కుంగుబాటుకు లోనయ్యానని, ప్రతి మహిళకు ఎదురయ్యే సమస్య ఇదని కాజల్
చెప్పింది. కుటుంబ సభ్యుల మద్దతు, చక్కటి వర్కవుట్స్ ద్వారా కుంగుబాటు నుండి
బయటపడ్డానని పేర్కొంది. ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు డిప్రెషన్ కి
లోనవుతారు. అయితే నన్ను అర్ధం చేసుకునే భర్త, కుటుంబ సభ్యుల అండతో ఆ పరిస్థితి
నుంచి బయటపడ్డాను’ అని కాజల్ తెలిపింది. ప్రస్తుతం ఆమె ‘ఇండియన్2, సత్యభామ
చిత్రాల్లో నటిస్తున్నది.