‘ఆదిపురుష్’ చిత్రంలో జానకి పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన
కృతిసనన్ ఇటీవలే నిర్మాతగా మారి చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయాణాన్ని
ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘బ్లూ బట్టరై ఫిల్మ్స్’ పేరుతో సొంత నిర్మాణ
సంస్థ స్థాపించారు. నెటిక్స్ కోసం ‘దో పత్తీ’ అనే చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. సీనియర్ నటి కాజోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా
కష్టమైన పని కాబట్టే, నిర్మాతగా మారానన్నారు కృతీ. ‘హీరోయిన్ గా పదేళ్ల
ప్రయాణం నాది. ఇక గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ‘హీరోయిన్ గా
ఇన్నేళ్ల ప్రయాణంలో అన్ని నేర్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ ఈ స్థాయికి
చేరుకున్నాను. ఈ క్రమంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. నటనను ప్రతి
క్షణం ఆస్వాదించాను. ఇప్పుడు మరింత శ్రమించాల్సిన సమయం వచ్చింది. నా హృదయానికి
నచ్చిన మరిన్ని కథలు ప్రేక్షకులను మెప్పించేలా చెప్పాలనేది నా ప్రయత్నం.
అందుకే నిర్మాతగా మారాను’ అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.