చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు కొనసాగింది. కొలమాసనపల్లిలో
చెరుకు రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోకేశ్‌కి స్థానికులు
గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది.
కమ్మనపల్లెలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు.
కొలమాసనపల్లిలో చెరకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి
ఎలాంటి తోడ్పాటూ అందడం లేదని ఎరువుల కొరతతో కర్ణాటక నుంచి ఎరువులు
తెచ్చుకుంటున్నట్లు లోకేశ్ ఎదుట రైతులు వాపోయారు.
టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసంపై మండిపడ్డ నారా లోకేశ్
కోలమాసనపల్లిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యువగళం పాదయాత్రకు వస్తున్న
ఆదరణ చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ ప్లెక్సీలు
ధ్వంసం చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు టీడీపీ ఫ్లెక్సీలు చూస్తే
ఎందుకంత భయమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి పసుపు రంగు అన్నా, తెలుగుదేశం
పార్టీ అన్నా భయం పట్టుకుందని అన్నారు. మా సహనాన్ని పరీక్షించొద్దని మరోసారి
మా జోలికి వస్తే తాటతీస్తామని హెచ్చరించారు.
చెరుకు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతాం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు
నియోజకవర్గంలో కొనసాగింది. యాత్రలో భాగంగా బైరెడ్డి పల్లె మండలంలోని
గ్రామాల్లో పలువురితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాకే ఊరులో
చెరుకు రైతు వెంకట రమణ తో నారా లోకేశ్ మాట్లాడారు. తనకి ఉన్న ఒకటిన్నర పొలం,
బెల్లం గానుగ లోకేశ్ కి చూపించి చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులు రైతు ఆయన
దృష్టికి తెచ్చారు. చెరుకు రైతులు కనీస మద్దతు ధర లేక పడుతున్న ఇబ్బందులు తనకు
తెలుసని లోకేశ్ అన్నారు. ‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు,
నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందు కారణంగా రైతులు నష్టపోతున్నారు.
వ్యవసాయానికి సాయం అందించడం నా బాధ్యత. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే
చెరుకు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,
పురుగు మందులు అందిస్తాం. కౌలు రైతులను ఆదుకుంటామని లోకేశ్ చెప్పారు. అనంతరం
బేలుపల్లె లో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లి
పలకరించారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని భవన నిర్మాణ
కార్మికుడు ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.