బెంగళూరు : కర్ణాటకలో బీజేపీ రద్దు చేసిన ముస్లిం రిజర్వేషన్ కోటాను తాము
అధికారంలో రాగానే తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చింది.
కొన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే బొమ్మై ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దేన్ని ఆధారంగా చేసుకుని మైనారిటీ
కోటాను రద్దు చేసి ఈడబ్ల్యూఎస్ కోటాలో చేర్చిందని కాంగ్రెస్ ప్రశ్నించింది.
2023 ఎన్నికల్లో తప్పనిసరిగా తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం
చేసింది.కర్ణాటకలో 2023 ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే బీజేపీ ప్రభుత్వం
రద్దు చేసిన ముస్లిం మైనారిటీ ప్రత్యేక రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామని
కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బొమ్మై ప్రభుత్వం తీసుకున్న ముస్లిం కోటా
రద్దు నిర్ణయాన్ని ఎండగడుతూ మైనారిటీలకు ఈ హామీ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని, అందుకే భావోద్వేగ సమస్యలను
లేవనెత్తడానికి ప్రయత్నిస్తోందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ)
అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన
వ్యాఖ్యానించారు. మే నెలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి
వస్తుందని కేపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను ఆస్తిలాగా
పంచవచ్చని వారు భావిస్తున్నారు. ఇది ఆస్తి కాదు మైనారిటీల హక్కు. వీరికి ఉన్న
4 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను రద్దు చేసి ప్రధాన సామాజిక వర్గాల్లోని వారికి
ఇవ్వడం మాకు ఇష్టం లేదు. మైనారిటీ సభ్యులు మా సోదరులు, కుటుంబసభ్యులు.
వొక్కలిగ, వీరశైవ-లింగాయత్‌లు ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారు. రాబోయే 45 రోజుల్లో
కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి
కేబినెట్ సమావేశంలోనే వీటన్నింటిని రద్దు చేస్తాం. ముస్లింలను ఓబీసీల జాబితా
నుంచి తొలగించడానికి ఎటువంటి కారణాలు లేవు. బొమ్మై ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో
ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే భావోద్వేగ సమస్యలను లేవనెత్తడానికి
ప్రయత్నిస్తోందని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.

ఇదివరకు కర్ణాటకలో ఓబీసీ కేటగిరీలో 2బీ అనే రిజర్వేషన్ కోటా ఉండేది. దానిలో
భాగంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్‌ను
ముస్లిం మైనారిటీకి తొలగించి.. వొక్కలిగ, వీరశైవ-లింగాయత్‌లకు కేటాయిస్తూ
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వొక్కలిగ, వీరశైవ-లింగాయత్‌లకు రిజర్వేషన్ల కోసం
ఈడబ్ల్యూఎస్‌లో 2సీ, 2డీ కేటగిరీలను గతంలోనే ఏర్పాటు చేశారు. ముస్లిం
మైనారిటీలకు రద్దు చేసిన 4 శాతం రిజర్వేషన్లను 2సీ, 2డీలకు సమానంగా
పంచనున్నారు. మతపరమైన మైనారిటీలను ఈడబ్ల్యూఎస్ జాబితాలో చేర్చాలని శుక్రవారం
సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.