విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా శుక్రవారం
గిడుగు రుద్రరాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ
పూర్వ వైభవం సంతరించుకునేందుకు పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు,
అభిమానులంతా సహకరించాలని, దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి
రావడమే లక్ష్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
జగన్, చంద్రబాబువి స్వార్థ ప్రయోజనాలు : ‘రెండు దశాబ్దాలకుపైగా
కాంగ్రెస్‌లోనే ఉన్నా. అన్ని అనుబంధ శాఖలను కలుపుకుని ముందుకు సాగుతా. ఓటు
బ్యాంకు పెంచుకునేందుకు కృషి చేస్తాం. ఎవరి నియోజకవర్గంలో వారే నాయకుడు.
లోకల్ క్యాడర్ని కలుపుకుని ముందుకు వెళ్లాలి. కులం, మతం కాదు. మానవత్వంతో
ముందుకు సాగాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ
స్వార్ధ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. త్వరలోనే ఉత్తరాంధ్రలో
పర్యటిస్తా. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని గిడుగు రుద్రరాజు
పేర్కొన్నారు.