అమరావతి : నిరుద్యోగుల పక్షాన యువత విద్యార్థుల సమస్యలతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారమే ధ్యేయంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ,రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, తెలుగు యువత నేతలకు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారిని ఉండవల్లి లోని తమ నివాసంలో గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ,రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగుయువత నాయకులు చెరుకుపల్లి నాగరాజు,ఎస్ డి జిలాని, శివకుమార్,టి ఎన్ టి యూ సి జిల్లా అధికార ప్రతినిధి గుంటి సతీష్ మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 27వ తేదీ నుండి యువనేత నారా లోకేష్ చేపట్టబోయే “యువగళం” పాదయాత్రకు పూర్తి సంఘీభావం తెలియజేస్తూ 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల కుటుంబానికి దూరంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న అందుకు అభినందనలు తెలియజేసారు.