హైదరాబాద్ : బీఆర్ఎస్లో అసమ్మతి రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ల కోసం మొదలైన
వర్గపోరు అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా భగ్గుమంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే
ప్రాధాన్యమిస్తూ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పోటీలో ఉంటామనుకున్న
ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభ్యర్థిని మార్చకపోతే సహకరించేది లేదని
ద్వితీయ శ్రేణి నాయకత్వం భీష్మిస్తుండగా కొన్నిచోట్ల సీనియర్ నేతలు
అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్
తెలంగాణలోని రాజకీయ పక్షాలు మొదలు బీఆర్ఎస్లోని సాధారణ కార్యకర్తల వరకూ..
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమయం రానే వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ
ఎన్నికల యుద్ధానికి సమరం శంఖం పూరించిన ప్రభుత్వాధినేత కేసీఆర్ తమ పార్టీ
తరపున బరిలో నిలవబోయే గెలుపు గుర్రాల మొదటి జాబితాను విడుదల చేశారు.