గుంటూరు : కార్మికులు, వేతన జీవులు, ఉద్యోగులు, పెన్షన్ దారులకు సుప్రీంకోర్టు
తాజా తీర్పుతో పెన్షన్ అనూహ్యంగా పెరుగుతుందన్న ప్రచారం జరుగుతున్నా కేంద్ర
కార్మిక శాఖ నేటికీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదని విజయవాడ ప్రెస్
క్లబ్ అధ్యక్షులు చలపతిరావు అన్నారు. దేశవ్యాప్తంగా పెన్షన్ దారులు కోట్ల మంది
ఉంటే వీరిలో లక్షల మంది వర్కింగ్, నాన్ వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారన్నారు. ఈ
నేపథ్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, టెలికాం సలహ కమిటి ఉమ్మడి గుంటూరు
జిల్లా సభ్యులు నిమ్మ రాజు చలపతిరావు మంగళవారం గుంటూరు పిఎఫ్ కార్యాలయంలో
అసిస్టెంట్ కమిషనర్ జి ఆర్ జే ఆర్ మాధవ శంకర్ ను కలసి పెన్షన్ దారుల నూతన
నిబంధనలపై చర్చించారు. ఈ సందర్భంగా పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ మాధవ శంకర్
మాట్లాడుతూ 2014 సెప్టెంబర్ ఒకటవ తేదీ లోపు రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్
కోసం 26(6),11(3) పారాలను పీఎఫ్ కార్యాలయంలో అందజేసి ఉండాలని, సక్రమంగా
పెన్షన్ ఎకౌంటుకు షేర్ ధనం చెల్లించని పక్షంలో పిఎఫ్ కార్యాలయం వాటిని రిటర్న్
చేసి ఉంటే సదరు బకాయి చెల్లించి దాఖలు చేయవచ్చని అన్నారు. 2014 తర్వాత రిటైర్
అయిన వారు తమ జీతంపై తగు నిష్పత్తిలో పెన్షన్ కోటకు చెల్లించకుండా పీ ఎఫ్
సొమ్మును మొత్తం డ్రా చేసుకుని ఉంటే తక్షణం 26(6),11(3)11(4) ఫారాలను ఆన్లైన్
లో దాఖలు చేస్తే, తీసుకొన్న సొమ్ములో ఎంత సొమ్ము వాపస్ చేయాలని సమాచారం
వస్తుంది. దీని వల్ల కనీసం ప్రస్తుత పెన్షన్ 3 వేల నుండి 12 వేలకు పైన పెరగే
అవకాశం వుంది. ఎన్నో శతాబ్దాలుగా పెన్షన్ పెంచాలన్న డిమాండ్ ఉందన్నారు. 1995
లో సిపిఐ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర
ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి పలు
కంపెనీలను సందర్శించి దేశవ్యాప్తంగా 12 వేల కోట్లు అన్ క్లెయిమ్ సొమ్ము పీఎఫ్
లో ములుగుతున్నట్లు గుర్తించి నివేదిక సమర్పించింది. ఇప్పటివరకు అన్ క్లెయిమ్
సొమ్ము 25 వేల కోట్ల కు చేరి నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. కాగా ప్రస్తుత
తరుణంలో నూతన పెన్షన్ అమలుపై అన్ని పక్షాలు పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా
ఉందన్నారు.