సాంకతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
ముగిసిన వారం రోజుల పాలిటెక్నిక్ అధ్యాపకుల అవాశ శిక్షణ
గుంటూరు : శిక్షణ పూర్తి చేసుకున్న అధ్యాపకులు పునశ్చరణకు పెద్దపీట వేస్తూ విద్యార్ధులను తీర్చిదిద్దాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్, సాంకేతిక విద్యా శాఖ సంయిక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ అధ్యాపకుల కోసం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వేదికగా చేపట్టిన వారం రోజుల రెసిడెన్షియల్ శిక్షణా తరగతులు శనివారం ముగిసాయి. ముగింపు కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ అధ్యాపక శిక్షణా ఫలాలు విద్యార్ధులకు చేరేలా అయా కళాశాలల్లో యాడ్అన్ కోర్సులను తక్షణమే ప్రారంభించాలన్నారు. అధ్యాపకులు అభివృద్ది చెందుకున్న సాంకేతికతను నిరంతరం అధ్యయనం చేసినప్పుడే తరగతి గదిలో విద్యార్ధులకు మంచి బోధన అందించగలుగుతారన్నారు. విద్యార్ధులలో అసక్తిని పెంపొందించేలా నూతన ఆవిష్కరణల పట్ల శ్రద్ధ వహించాలన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్దులు సర్వతోముఖాభివృద్దితో సంపూర్ణ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించగలిగేలా తీర్చిదిద్దవలసిన బాధ్యత అధ్యాపక బృందంపై ఉందన్నారు. పరిశ్రమ అవసరాలను గుర్తించి తదనుగుణంగా విద్యాబోధనను మెరుగుపర్చుకోవాలని, ప్రపంచీకరణ పరిస్ధితులను నిశితంగా గమనిస్తూ ఉండాలని నాగరాణి స్పష్టం చేసారు. ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నుండి సివిల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్, మెకానికల్ బ్రాంచ్ లకు చెందిన 123 మంది అధ్యాపకులకు అవకాశం కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్ కుమార్, కార్యక్రమ సమన్వయకర్తలు సుబ్బారెడ్డి, ఓఎస్డి నాగేశ్వరావు, సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు, సంయిక్త కార్యదర్శులు సత్యన్నారాయణ మూర్తి , జానకి రామయ్య, ఉప సంచాలకులు డాక్టర్ ఎంఎవి రామకృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.