అనంతపురం నగరంలో “సన్ రే” మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించటం వల్ల
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అదుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని నడిమి వంక సమీపంలో
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మేనల్లుడు, ప్రముఖ న్యూరో సర్జన్
డాక్టర్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన “సన్ రే” ఆసుపత్రిని ఆదివారం
ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ…అన్ని అత్యాధునిక సదుపాయాలతో మెదడుకు సంబంధించిన శస్త్ర
చికిత్సలతో పాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయటం సంతోషంగా
ఉందన్నారు.రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కూడా కృషి
చేస్తోందన్నారు.ఈ సందర్భంగా న్యూరో సర్జన్ రోహిత్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు
తెలియజేశారు.ఈ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే
విశ్వేశ్వరరెడ్డి,రాప్తాడు,రాయదుర్గం ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, కాపు
రామచంద్రారెడ్డి,యువనేత ప్రణయ్ రెడ్డి,రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు
పాల్గొన్నారు.