అనంతరం ఇడుపులపాయకు చేరుకుని మహానేతకు ఘన నివాళి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం
అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్
రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్సార్ రైతు
దినోత్సవంలో పాల్గొననున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా
వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను
ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 2022– ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.2 లక్షల
మందికి రైతులకు లబ్ధి కలిగిస్తూ రూ.1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేస్తారు.
తద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,36,950 మంది రైతులకు రూ.212.94 కోట్ల మేర
లబ్ధి చేకూరుతుంది. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ
కార్యక్రమం తర్వాత వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. నేటి నుంచి
10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 8వ తేదీ
మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని మహానేతకు
నివాళులర్పిస్తారు.
9న గండికోటకు సీఎం జగన్ : ఈనెల 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట వద్ద
ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం
అక్కడ వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా
నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్
ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్–1 పనులను, పులివెందులలో నూతనంగా
నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏపీ
కార్ల్‌లో న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు
పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారంభోత్సవం చేస్తారు.
అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు కడపలోని రాజీవ్
మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం
కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
పాల్గొంటారు. కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.