యాంకర్, నటి అనసూయ.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మరోసారి రచ్చ నడుస్తోంది.
అర్జున్ రెడ్డి సినిమాలో డైలాగ్స్ విషయంలో విమర్శలు చేసినప్పటి నుంచి అనసూయపై
విజయ్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. తాజాగా విజయ్, సమంత హీరోహీరోయిన్లుగా
నటిస్తున్న ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను ఉద్దేశించేలా అనసూయ చేసిన
ట్వీట్ అతని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
ఈ పోస్టర్ లో ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉంది. ‘ఇప్పుడే ఒకటి చూశాను..
The నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’ అని అనసూయ ట్వీట్
చేసింది. అది విజయ్ ను ఉద్దేశించేలా ఉండటంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో
తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.

అనసూయను అంటీ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్
ట్రెండింగ్లో ఆంటీ హ్యాష్ ట్యాగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాళ్లను మరింత
రెచ్చగొట్టేలా అనసూయ ఇంకో ట్వీట్ చేసింది. ‘భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ..
బంగారుకొండలంతా.. ఎక్కడో, అక్కడ నేను నిజం అనేది ప్రూ చేస్తూనే ఉన్నందుకు
థ్యాంక్స్ రా అబ్బాయిలు’ అని ట్వీట్ చేయడంతో విజయ్ అభిమానులు మరింత
రెచ్చిపోయారు. కొంతమంది అనసూయను తీవ్రంగా దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలువురు అనసూయకు మద్దతిస్తున్నారు. వ్యక్తిగత దూషణను ఖండిస్తున్నారు.
మరికొందరేమో అనవసరంగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారంటూ ఆమెను విమర్శిస్తున్నారు.