మార్గం మధ్యలో దారి తప్పి రోజంతా అటవీ ప్రాంతంలో గడిపిన యువకులు
122 కి కాల్ చేయడంతో రంగంలోకి దిగిన రాపూరు అటవీ శాఖ అధికారులు, పోలీసులు
లొకేషన్ ఆధారంగా అన్నమయ్య-నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో యువకులను గుర్తించిన అధికారులు
యువకులకు ఆహారం,మంచి నీరు ఇచ్చి సురక్షితంగా పెంచలకోన కు తీసుకువస్తున్న అధికారులుయాంకర్: దేవుడు మీద భక్తితో ఏడు మంది యువకులు తన సొంత గ్రామం నుంచి దేవుడు సన్నిధికి అటవీ మార్గంలో పాదయాత్ర గా వస్తూ దారి తప్పి రోజంతా అటవీ ప్రాంతంలో ఉంది 122 కు కాల్ చేయడంతో అటవీ,పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఏడు మంది యువకులను సురక్షితంగా రక్షించారు..అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కొంపిపురం గ్రామానికి చెందిన ఏడు మంది యువకులు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రానికి అటవీ ప్రాంతం గుండా శుక్రవారం బయలుదేరారు.. దట్టమైన అటవీ ప్రాంతంలో దారి తప్పిన యువకులు రాత్రంతా అటవీ ప్రాంతంలో జాగారం చేసి 122 కాల్ చేయడంతో రాపూరు అటవీశాఖ రేంజి అధికారి రవీంద్రబాబు, రాపూరు ఎస్సై మాల్యాద్రి నేతృత్వంలో అటవీ,పోలీస్ బృందాలు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అన్నమయ్య-నెల్లూరు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో వారిని గుర్తించి వారికి త్రాగునీరు,భోజనం అందించి సురక్షితంగా వారిని పెంచలకోన పుణ్యక్షేత్రానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు..