చేరుకున్నారు. బుధవారం ఉదయం అన్నవరం గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి సత్తెన్న
స్వామి దేవాలయానికి పవన్ వచ్చారు. సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆపై
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ వేద పండితుల నుంచి
ఆశీర్వచనాన్ని స్వీకరించారు. దర్శనానంతరం జనసేనాని తిరిగి గెస్ట్‌హౌస్‌కు
బయలుదేరి వెళ్లారు.
నేటి నుంచి జనంలోకి పవన్ : నేటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్
కళ్యాణ్ ‘‘వారాహి’’ యాత్ర మొదలుకానుంది. సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభలో
జనసేన అధినేత ప్రసంగించనున్నారు. ఈ నెల 23వ వరకు పవన్ జనంలోనే ఉండనున్నారు.
మొత్తం 8 నియోజకవర్గాల్లో సభలు జరుగనున్నాయి. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20న
ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న పి.గన్నవరం నియోజకవర్గం, అదేరోజు రాజోలు
నియోజకవర్గంలోని మలికిపురంలో సభలు నిర్వహించనున్నారు. 27న నరసాపురంలో యాత్ర,
సభ జరుగనుంది. అన్ని సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలనుద్దేశించి
ప్రసంగించనున్నారు. జనసేనాన్ని వారాహి యాత్ర నేపథ్యంలో ఆ పార్టీ వర్గాలు అన్ని
ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి
కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
101 కొబ్బరికాయలు దిష్టి తీసిన జనసేనలు : మరోవైపు తమ అధినేత పవన్ కళ్యాణ్
వారాహి యాత్ర విజయవంతం కావాలని చిత్తూరు జిల్లాలోని మొగిలి ఆలయంలో జనసేన
నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరి టెంకాయలు కొట్టి జనసేన శ్రేణులు
దిష్టి తీశారు. బంగారు పాళ్యం మండలానికి సంబంధించిన కోడి చంద్రయ్య ఆధ్వర్యంలో
జనసేన నాయకులు కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు. ప్రభుత్వం నుంచి ఎన్ని
అడ్డంకులు ఎదురైన వారాహి యాత్ర ఆగదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన
సైనికులు ఉంటారంటూ హెచ్చరికలు జారీ చేశారు.