ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు విశాఖ వేదిక కాబోతోందని ఐటీ
మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్
ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, మార్చి 28,29 తేదీల్లో జీ20 సదస్సులు
జరగబోతున్నాయన్నారు. త్వరలో వైజాగ్ రాజధాని కాబోతోందని, ముఖ్యమంత్రి కూడా
అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్, అమరావతి
లెజిస్లేటివ్, కర్నూలు న్యాయ రాజధానులుగా కొనసాగుతాయని మంత్రి అమర్నాథ్
వెల్లడించారు. డిసెంట్రలైజేషన్ కు కట్టుబడి ఉన్నామని, ఏ ప్రాంతాన్ని చిన్నచూపు
చూసే ప్రసక్తి లేదని తెలిపారు. విశాఖపట్నం రాజధాని నిర్ణయం ఇప్పుడు తీసుకుందని
కాదన్నారు. ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.