విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధికి,
సంక్షేమానికి సహకరించేదిగా ఉందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
బడ్జెట్ వాస్తవికమైనదిగా, ముందుచూపుతో రపొందించబడినదిగా ఉందని అన్నారు. మూలధన
వ్యయానికి గత ఆర్థిక సంవత్సరంలో 16వేల కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్ లో
31 వేల కోట్లు కేటాయించారని, గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే
ఇంచుమించు రెట్టింపు కేటాయింపు జరిగిందని అన్నారు. అలాగే రోడ్డు కనెక్టివిటీ
కోసం 9 వేల కోట్లు, అన్ని రకాల సంక్షేమ పథకాల కోసం 54 వేల కోట్లు, విద్యారంగం
కోసం 32 వేల కోట్లు కేటాయించడం అత్యంత ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్ర జనాభాలో
70శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ రంగానికి ఇచ్చిన
ప్రాధాన్యత ప్రస్తుత బడ్జెట్ లో స్పష్టంగా ప్రతిబింబిస్తోందని విజయసాయి రెడ్డి
అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ లో జలవనరులకు కేటాయించిన 11909 కోట్ల
తో సహా మొత్తం 41437 కేటాయించడంతో గత ఆర్థిక సంవత్సరం 2022-23లో13.18శాతం
వృద్ధి రేటు సాధించిన మారదిగానే ఈ సంవత్సరం కూడా వ్యవసాయం రంగం గణనీయమైన
వృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నానని విజయసాయిరెడ్డి అన్నారు.