36వరోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ 39వ డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని.
స్థానిక కార్పొరేటర్ కిలాడి.జ్యోతి దుర్గారావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కి ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు.
అపూర్వ స్వాగతం పలికిన ఈదర సుబ్బమ్మ దేవి పాఠశాల విద్యార్థులు
భారీ గజమాలలు, మహిళల మంగళ హారతులతో ఆళ్ల నానికి ఘన స్వాగతం
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తూ గడప గడపకు పాదయాత్రగా పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని
జగనన్న సంక్షేమ పాలనే భేష్ అంటూ ప్రశంసల జల్లు కురిపించిన లబ్దిదారులు – అడుగు అడుగునా ఆళ్ల నాని కి జనం నీరాజనం
త్వరలోనే కమ్యూనిటీ భవన్ నిర్మించేలా చర్యలు చేపడతామంటూ ఎమ్మెల్యే ఆళ్ల నాని భరోసా.
ఏలూరు : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, చిన్నారులకు అందించే గోరుముద్ద పధకం నుంచి అవ్వా, తాతలకు అండగా అంధించే పెన్షన్ కానుక వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 36వరోజు ఏలూరు కార్పొరేషన్ 39వ డివిజన్ లోని సుబ్బమ్మ దేవి స్కూల్ సెంటర్, పాముల దిబ్బ ప్రాంతాల్లో ఆళ్ల నాని పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కిలాడి.జ్యోతి దుర్గారావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, మహిళలు ఆళ్ల నాని కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి పాఠశాల విధ్యార్థులు ఆళ్ల నానికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస.జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్దిదారులతో మాట్లాడుతూ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు సంక్షేమ పథకాల అమలు ఎంతో బాగుందని, రాబోయే రోజుల్లో జగనన్న కు తామంతా అండగా ఉంటామని,
జగన్మోహన్ రెడ్డి అంటే మా ప్రతి కుటుంబంలో సభ్యుడి వంటి వారు అంటూ లబ్దిదారులు ఎంతో భావోద్వేగాలతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ ప్రార్ధనల అవసరతల కొరకు 200 గజాల స్థలాన్ని చర్చ్ నిర్మాణం కొరకు కేటాయించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కి స్థానిక సంఘస్థులు కృతజ్ఞతలు తెలిపారు, అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్. నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు,గుడిదేసి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ గంపల.బ్రహ్మావతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, నగర వైఎస్సార్ సిపి అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్,
వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం , కో-అప్షన్ సభ్యులు పెదబాబు, మున్నుల జాన్, మార్కెట్ యార్డు డైరెక్టర్లు మేతర, ఖాజా ముగ్ధుమ్, కోరాడ బాబు, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల, పొలిమేర దాసు, తంగేళ్ల రాము,సుంకర చంద్రశేఖర్, ఇనపనూరి కేదారేశ్వరీ జగదీష్, తుమరాడా స్రవంతి, కత్తిరి రామ్మోహన్, దేవరకండ శ్రీనివాస్, జయకర్, లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు, దొంగ రామాంజనేయులు, తంబీ, వైఎస్సార్ సిపి నాయకులు కిలాడి దుర్గారావు, నిడికొండ నరేంద్ర, మట్టా రాజు, పాము సామ్యూల్, పొలిమేర హరికృష్ణ, నున్న కిషోర్, అరీఫ్,సుల్తానా ,అమీనా అన్సారీ, రేష్మ, బండారు కిరణ్, ఇనపనూరి జగదీష్, దాసరి రమేష్, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, తోటకూర కిషోర్, లూటుకుర్తి సుభాష్, పిట్టా ధనుంజయ్, 47వ డివిజన్ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు,సామ్యూల్, వెంకట రంగారావు, మునిసిపల్ కమిషనర్ షేక్ షాహీద్, ఎమ్మార్వో సోమ శేఖర్, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ,సచివాలయా సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.