మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు
ఆళ్ల నాని
59వరోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ 25వ డివిజన్
శనివారపు పేట-1 సచివాలయ పరిధిలో పర్యటించిన ఆళ్ల నాని
ఏలూరు : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి గారి లక్ష్యం అని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు
జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో 59వరోజు పాదయాత్రలో భాగంగా సోమవారం మధ్యాహ్నం గం.3.30 నుంచి
ఏలూరు కార్పొరేషన్ 25వ డివిజన్ శనివారపు పేట-1 సచివాలయ పరిధి లోని ప్రాంతాల్లో
ఆళ్ల నాని పర్యటించారు. స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ గునిపూడి శ్రీనివాసన్
ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, చిన్నారులు, మహిళలు
ఆళ్ల నాని కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలు, మహిళల మంగళ
హారతులు, పూల జల్లులతో ఆళ్ల నానికి గడప గడపలో జనం నీరాజనాలు పలికారు. అనంతరం
గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల
సంక్షేమం కోసం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్దిదారులతో
మాట్లాడుతూ స్వయంగా పరిశీలించారు. ప్రతి నెలా వాలంటీర్ వచ్చి ఫించన్
అందిస్తున్నాడా అవ్వా?.. అమ్మ ఓడి వచ్చిందా తల్లి?..రైతు భరోసా అందిందా తాతా?
అంటూ ప్రతి ఒక్కరినీ ఆళ్ల నాని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పధకాల అమలు
తీరును స్వయంగా పరిశీలించారు. స్థానిక చేనేత కళాకారులతో ఆళ్ళనాని ముఖాముఖి
మాట్లాడారు. నేతన్నలు మగ్గం నేస్తున్న విధానాన్ని ఆళ్ల నాని స్వయంగా
పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులకు అండగా నిలుస్తున్న పలు సంక్షేమ
పథకాలు అమలు చేస్తున్న జగనన్నకు నేతన్నల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
ఈ సందర్భంగా తమకు సంక్షేమ పథకాల అమలు ఎంతో బాగుందని, రాబోయే రోజుల్లో జగనన్న
కు తామంతా అండగా ఉంటామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ జీవితాల్లో కొండంత
అండ లభించిందని గడప గడపలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్,
నూకపెయ్యి సుధీర్ బాను, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు , వైస్
చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ ఛైర్మన్ మంచెమ్ మైబాబు, డైరెక్టర్ కోరాడ బాబు,
మేతర సురేష్, జక్కుల బెనర్జీ, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం ,
వైఎస్సార్ సిపి నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నున్న
స్వాతి కిషోర్, కో-అప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాధ్, కార్పొరేటర్లు
జిజ్జువరపు విజయనిర్మల, పొలిమేర దాసు, జయకర్, సుంకర చంద్రశేఖర్, బత్తిన విజయ్
కుమార్, అద్దంకి హరిబాబు, లీగల్ సెల్ నాయకులు ప్రత్తిపాటి తంబీ, చేనేత సొసైటీ
చైర్మన్ కొల్లిపాక సురేష్, వైఎస్సార్ సిపి నాయకులు పొలిమేర హరికృష్ణ,
జిజ్జువరపు రమేష్, కిలాడి దుర్గారావు, బండారు కిరణ్, శర్మ , తోట సుధీర్, అర్జి
నాగేశ్వరరావు, జనపరెడ్డి కృష్ణ, మట్టా రాజు, నిడికొండ నరేంద్ర, శివరావు, దాసరి
రమేష్, నున్న కిషోర్, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, తోటకూర కిషోర్, లూటుకుర్తి
సుభాష్, పిట్టా ధనుంజయ్, వితాల చంద్రశేఖర్, మెగా బాబీ, కొత్తపల్లి బాబూరావు,
కోసనం మధు, కంది రంగబాబు, కుందేటి చిన్ని, జిలాని, ప్రసాద్ , మునిసిపల్
కమిషనర్ షేక్ షాహీద్, ఎమ్మార్వో సోమశేఖర్, డా.మాలతి, పలు శాఖల అధికారులు,
పార్టీ నాయకులు, కార్యకర్తలు , సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.