దేశానికే ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు: మంత్రి ఎర్రబెల్లి
హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికీ ముఖ్యమంత్రి కే
చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్
రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు బలపడ్డాయని చెప్పారు. పల్లె
ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని గ్రామాలు దేశంలో ఎక్కడా లేని విధంగా
అన్నివిధాలుగా అభివృద్ది చెందాయని, దేశానికి ఆదర్శంగా మారాయన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం, మైలారం గ్రామానికి చెందిన పలు కుల
సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. ఈ
సందర్భంగా తమకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి
మంత్రి సానుకూలంగా స్పందించారు.