దొర
టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ పై సమీక్ష
సాలూరు (పార్వతీపురం మన్యం) : అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,రాష్ట్ర
గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర , ఏ.పి.టిడ్కోచైర్మన్ జమ్మాన ప్రసన్న
కుమార్ సాలూరులో నిర్మాణంలో ఉన్నటువంటి టిడ్కో గృహ సముదాయాల నిర్మాణ ప్రగతిపై
బుధవారం తనిఖీ చేశారు. ఆగష్టు 2023 నాటికి 31వేలు టిడ్కో గృహాలను
లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించిన
లక్ష్యాన్ని పూర్తి చేయాలనే దిశగా సాలూరు లో ఏ.పి.టిడ్కో గృహ సముదాయాలలో
జరుగుతున్న నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్ తో
కలిసి పరిశీలించారు. అనంతరం సాలూరు పురపాలక సంఘం పరిధిలో 1048 గృహాలు
ప్రారంభోత్సవమునకు అందించే దిశగా నిర్మాణం జరుగుతున్నటు వంటి పనులను
ఇంజనీరింగ్, మునిసిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. సాలూరులో గుమడాం వద్ద
నిర్మాణం జరుగుతున్నటువంటి 1280 టిడ్కో ఇళ్లకు సంబందించి (హౌసింగ్ అండ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల పురోగతిని సంభందిత ఇంజనీరింగ్ అధికారులు ,
కాంట్రాక్టింగ్ ఏజెన్సీ (వి.ఎన్.సి అండ్ శింఘన్) సిబ్బందితో కలిసి పర్యటించి
తదుపరి వారితో సంయుక్తంగా చర్చించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగష్టు
నెలలో ఇళ్ళ నిర్మాణాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేసేందుకు
సమిష్టిగా కృషి చేయాలని అధికారులకు, ఏజేన్సీకి ఆదేశించారు. ఇప్పటికే రాష్టంలో
72 వేల గృహాలు అందించడం జరిగిందని, తదుపరి వచ్చే ఆగస్ట్, అక్టోబర్ నెలలలో
ప్రభుత్వం నిర్దేశించిన ఒక లక్షా యాభై వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించే
కార్యక్రమములో భాగముగా చేయవలసిన హౌసింగ్, మురుగు నీటి శుద్ది (ఎస్ టి పి )
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ( రోడ్లు మంచినీటి డ్రైనేజీ ఎలక్ట్రికల్ ) అన్ని పనులు
పూర్తి చేసి అన్ని సదుపాయాలతో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులను
ఆదేశించారు ఈ కార్యక్రమంలో టిడ్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ నరసింహమూర్తి,
మునిసిపల్ కమిషనర్ హనుమంతు శంకర రావు, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి, డిప్యూటీ
ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ రెడ్డి, శశిధర్, సి.ఎల్.టి.సి, కాంట్రాక్టింగ్
ఏజెన్సీ పాల్గొన్నారు.