30 ఏళ్ళ తర్వాత చివరి ఛాన్స్ అంటుంటే..ఇదేం ఖర్మరా బాబూ
గత ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టినా..మళ్ళీ ఇదేం ఖర్మరా బాబూ
బాబు పేరు చెబితే గుర్తొచ్చేవి వెన్నుపోటు, దగా, మోసం, వంచనలే
30 ఏళ్ళల్లో బాబు చేయలేని మేలు జగన్ పాలనలో మూడేళ్ళలో సాకారం
రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా
తిరుపతి : చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌ను చూసి ప్రజలు ఇదేం ఖర్మరా బాబు
అనుకుంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గురువారం ఆమె తిరుపతిలో జగనన్న
క్రీడా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ
ద్రోహి చంద్రబాబు.. ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు.
చంద్రబాబు మెంటల్ బాలెన్స్ పడిపోయిందని ఆమె మండిపడ్డారు. ‘‘ఎమ్మెల్యే అవడమే
కష్టం అనుకుంటున్న వ్యక్తిని సీఎం చేయాలనుకోవడం నీ అజ్ఞానం. లోకేష్,
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను చంపాలనుకుంటున్నారని సింపతీ డ్రామాలు ఆడుతున్నారు.
తండ్రి లాంటి ఎన్టీఆర్‌ను చంపిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి రోజా
దుయ్యబట్టారు.
తిరుపతి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హత్య చేయాల్సిన పని మాకు
లేదని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం తిరుపతి జిల్లా
క్రీడా సంబరాలు ప్రారంభం కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం మాట్లాడుతూ
చంద్రబాబు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని అడగడం ఇదేం కర్మ రా బాబు అని ప్రజలు
అనుకుంటున్నారు అన్నారు. చంద్రబాబును చూసి ఇదేం కర్మ రా బాబు అనుకుంటున్నారని
వివరించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని తెలియజేశారు. రాయలసీమ వాసిగా
చంద్రబాబును చూసి తలదించుకుంటున్నారన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు వస్తుంటే
అడ్డుకునేలా చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక వర్గాల వారీగా
మోసం చేసిన చంద్రబాబు వారిని ఓట్లు అడుగుతుంటే ఇదేం కర్మ రా బాబు అని
అనుకుంటున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాలు మాని మనవాడితో
ఆడుకుంటే మేలు అన్నారు. చంద్రబాబుకు ఏ సింపతి బాబుకు ఏ వర్గం సింపతి సూపడం
లేదన్నారు.