టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు : తుని నియోజక వర్గం టీడీపీ సీనియర్ నాయకులు, తుని ప్రభుత్వ ఆసుపత్రి
అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు పోల్నాటి శేషగిరిరావు పై స్థానిక ఎమ్మెల్యే
దాడిశెట్టి రాజా అనుచరులు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ
తీవ్రంగా ఖండిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
అన్నారు.
శేషగిరిరావు ఇంట్లో ఉండగానే వైసీపీ వర్గం దాడికి దిగింది అన్నారు. ప్రభుత్వ
ఆగడాలకు అడ్డుగా నిలబడి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసే టీడీపీ నేతల
గళాలపై అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. తుని నియోజకవర్గంలో కాపులకు
అన్యాయం చేస్తున్న వైసీపీ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును
చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. హత్యలు, దాడులు, హత్యాయత్నం చేసిన
వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు బాధితుల తరపున పోరాడుతామని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.