77 పరుగులతో ఆకట్టుకున్ననికోలస్
అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ నికోలస్ పూరన్ 8 సిక్సర్లు, 5
బౌండరీలతో అజేయంగా 77 పరుగులు చేసి డెక్కన్ గ్లాడియేటర్స్‌కు బంపర్ ఆఫర్లా
విజయాన్నిఅందించాడు. మొదట బ్యాంటింగ్ కు దిగిన గ్లాడియేటర్స్ జట్టు 6
వికెట్లకు 134 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో అబుదాబి జట్టు
విఫలమై 6 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. అబుదాబి జాయెద్ క్రికెట్
స్టేడియంలో జరిగిన అబుదాబి టీ10 మొదటి రోజు మ్యాచ్‌లో..డెక్కన్ గ్లాడియేటర్స్
35 పరుగుల తేడాతో అబుదాబి జట్టుపై విజయం సాధించింది.