గాంధీ పార్క్ ను నూతన హంగులతో అభివృద్ది చేస్తున్నాం
నగర అభివృద్ది కి సహకారం అందిస్తున్న జగన్ కి ధన్యవాదాలు
37వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
విజయవాడ పశ్చిమ : గాంధీ పార్క్ ను నూతన హంగులతో అభివృద్ది చేస్తున్నామని,
గాంధీజీ, సుందరమ్మ స్కూల్స్ ను అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నామని మాజీ
మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
స్థానిక 37వ డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు క్షేత్ర
స్థాయిలో బుధవారం మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాసరావు విసృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ
అభివృద్ది పనులు ఎలా జరుగుతున్నాయని పరిశీలించడం జరిగిందన్నారు. రోడ్లు కూడా
అభివృద్ది చేస్తున్నామన్నారు.అభివృద్దే ధ్యేయంగా
పనిచేస్తున్నామన్నారు.అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్దం అని అన్నారు. నగర
అభివృద్ధికి సహకారం అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
నాడు -నేడు పేరుతో స్కూల్ అభివృద్ది చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో
అభివృద్ది కుంటిపడిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్
మండేపూడి చటర్జీ, 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ, జైన్ కార్పొరేషన్
చైర్మన్ మనోజ్ కొఠారి, దుర్గ గుడి ధర్మకర్త బుద్దా రాంబాబు, సుంకర శివ ప్రసాద్
గ్రంధి రమేష్, జిలానీ, తదితర డివిజన్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం
కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, నగర పాలక సంస్థ అధికారులు
పాల్గొన్నారు.