అభివృద్ధి వికేంద్రీకరణ పై అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో గల కేటీఆర్ ఫంక్షన్ హాల్ లో నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్టు జేఏసీ ఒక ప్రకటనలో తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ మన ప్రజాస్వామిక హక్కుఅని, ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల కొందరి ప్రయోజనాలే నెరవేరుతాయని అది పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రాంతాలు కూడా సమాన స్థాయి పొందాలని ఆకాంక్షించింది. రాజధాని మొదలుకొని సాగునీరు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇలా అన్ని రంగాల్లో వికేంద్రీకరణ అవసరం ఎంతైనా ఉందని, ఈ నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి పోరాటం చేయాల్సి ఉందని అది అభిప్రాయపడింది.. ఆ పోరాట మార్గంపై చర్చించడం కోసం నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని,అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి పోరాటం జయప్రదం కావడానికి తోడ్పడవలసిందిగా అనంతపురం అభివృద్ధి వికేంద్రీకరణ జేఏసీ పిలుపునిచ్చింది.