గుంటూరు : అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని చంద్రబాబుకు తెలుసు.
చంద్రబాబు అమరావతిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే చేశారు. అమరావతిలో రియల్
ఎస్టేట్ తప్ప ఏమైనా జరిగిందా? అని ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. ఈ
క్రమంలోనే నక్కా ఆనంద్ బాబుపై సురేష్ ఫైరయ్యారు. ఎంపీ నందిగం సురేష్
ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పచ్చటి పొలాలను నాశనం చేయవద్దని ఆనాడే
రైతులు వేడుకున్నారు. బలవంతంగా భూములు లాక్కుని రాజధాని ఏర్పాటు చేశారు.
దుర్మార్గమైన ఆలోచనతోనే చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగేది
పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం. ప్రజలంతా వ్యతిరేకించారు కాబట్టే తాత్కాలిక
సచివాలయం కట్టాడు. నక్కా ఆనంద్ బాబు చంద్రబాబు కోసం కాదు. దళితుల కోసం
మాట్లాడాలి. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు పథకం.
చంద్రబాబుకు పాలేరులా పవన్ పనిచేస్తున్నారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్
కోసమే నక్కా ఆనంద్ బాబు మాట్లాడాడు. మేం కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా
మాట్లాడగలం. మీ మాదిరిగా కాదు మాకు కొంచెం విజ్ఞత ఉంది. చంద్రబాబు ఓ గుంట
నక్క. మీరు మొదట చెప్పిన అమరావతికి రాజధాని పెట్టిన అమరావతికి అసలు సంబంధమే
లేదు. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆఫీసులు తప్ప మరొకటి కనిపిస్తున్నాయా?.
రాజధాని పేరుతో పచ్చని పొలాలను చంద్రబాబు నాశనం చేశాడు. భూదాహం ఉన్న వారంతా
కలిసి ఏర్పాటు చేసుకున్నదే రాజధాని. రియల్ ఎస్టేట్ కోసం మొదలు పెట్టిందే
అమరావతి ఉద్యమం. అమరావతి ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారు. రైతులను నాశనం
చేసింది చంద్రబాబే. అమరావతి మొత్తం తనదేనంటూ లోకేష్ మేకపోతు గాంభీర్యం
ప్రదర్శిస్తున్నాడు. లోకేశ్‌కు చేతనైతే ముందు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో
అడుగుపెట్టాలి. పనికిమాలినోళ్లకు పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్. లోకేశ్ యాత్ర
ఫెయిలవ్వడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి అందరూ భయపడుతున్నారు. నక్కా ఆనంద్ బాబు నోరు
అదుపులో పెట్టుకోవాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు టీడీపీ నేతలు ఆత్మ
పరిశీలన చేసుకోవాలన్నారు.