విజయవాడ : స్థానిక 56వ డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు
క్షేత్ర స్థాయిలో శనివారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు విసృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా వెలంపల్లి
మాట్లాడుతూ డివిజన్ అభివృద్ది గురించి పర్యటించామన్నారు.కొంత డ్రైనేజ్ సమస్య
వుంది త్వరితగతన పరిష్కరిస్తామని తెలిపారు.త్వరలోనే వాటర్ ట్యాంకు నిర్మిస్తాం
అని అన్నారు.జేపీ టవర్స్ అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం అని
తెలిపారు.ప్రతి ఒక్కరికీ మంచి చేయాలని పని చేస్తున్నాం అని అన్నారు.నగర
అభివృద్ది కి కట్టుబడి ఉన్నామన్నారు.గతంలో అమరావతి పేరుతో విజయవాడ నగర ప్రజలను
మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.కృష్ణ లంక రిటైనింగ్ వాల్
నిర్మించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నల్
దినకర్ పుంద్కర్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ యాలకల చలపతిరావు,వాసా బాబు,గురు
నాయుడు,సుబ్రమణ్యం,గొలగాని శ్రీనివాస్, నాగపావని,స్రవంతి, తదితర డివిజన్
నాయకులూ కార్యకర్తలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు సచివాలయం సిబ్బంది నగర
పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.