న్యూఢిల్లీ : దేశ రాజధాని దిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకొంది.టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ అయ్యారు. 2018లో
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షా,
చంద్రబాబుల భేటీ జరగడం ఇదే ప్రథమం. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వీరి సమావేశం ప్రాధాన్యం
సంతరించుకొంది. శనివారం సాయంత్రం ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని
నాని, రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి ఢిల్లీకి
వచ్చిన చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్వాగతం
పలికారు. అనంతరం అంతా కలిసి ఇక్కడి అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్
నివాసానికి చేరుకున్నారు. రాత్రి 8.55 గంటలకు చంద్రబాబు ఒక్కరే కృష్ణ మీనన్
మార్గ్‌లోని అమిత్‌షా ఇంటికి వచ్చారు. తర్వాత కొద్దిసేపటికే బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మధ్య రాత్రి 9.49 గంటల
వరకు సమాలోచనలు జరిగాయి. సమావేశం అనంతరం ఎవరూ విలేకర్లతో మాట్లాడలేదు.
హోంమంత్రితో జరిగిన సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నందున దీన్ని
రాజకీయపరమైన భేటీగా భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై
చర్చించారా.. ఇంకా ఏదైనా అంశాలపై సమాలోచనలు జరిపారా..అనేది తెలియరాలేదు.