విజయవాడ : అమిత్ షా ప్రకటనలపై ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలని ఏపీసీసీ
వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. ఆంద్రప్రదేశ్ లో జగన్ పాలన
పూర్తిగా అవినీతి మయమని, మైనింగ్, భూదందాలు, నకిలీ మందుల వ్యాపారం,అవినీతి
కుంభకోణాలు తప్ప మీరేమీ లేదని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన
అంశాలపైన, అలాగే కేంద్రం 2014 నుండి 23 వరకూ ఆంద్రప్రదేశ్ కు 2.30 లక్షల
కోట్లు సహయం చేసిందని ప్రకటించిన దానిపైన రాష్ట ముఖ్యమంత్రి ప్రజలకి
వాస్తవాలు తెలపాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున డిమాండ్
చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ జగన్ అవినీతి కేడర్ స్వాహా
చేస్తున్నదని కేంద్ర హోం మంత్రి చెప్పడం రాష్ట్ర ప్రజలలో అనేక అనుమానాలకు
తావిస్తున్నాయని కనుక వాస్తవాలు ఏమిటో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టం
చేయాలని కోరారు. బిజేపినే కాదు, ఆ పార్టీతో పొత్తు ఉండే పార్టీలను కూడా
మట్టి కరిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపి లకు గాను 20 ఎంపి సీట్లను
బిజేపి – ఎన్డీఏ పక్షాలని గెలిపించాలని అమిత్ షా అభ్యర్థించిన ప్రకటనను
కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబడుతున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకత
హోదా అమలు కాకుండా, ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ద్రోహం చేసిన
బిజెపిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని అలాగే బిజెపితో పొత్తుకు
సిద్ధమయ్యే పార్టీలను కూడా ఎన్నికల్లో మట్టి కల్పిస్తారని కాంగ్రెస్ పార్టీ
స్పష్టం చేస్తున్నదని, రాష్ట్రంలో వైసిపి ,టిడిపి ,జనసేన పార్టీలన్నీ
ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపితో అంట కాగుతున్నాయని ఈ విషయాన్ని రాష్ట్ర
ప్రజలు గ్రహించి బీజేపీతో రాజీలేకుండా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని
ఆదరించాలని కోరారు. వైసిపి, టిడిపి, జనసేనలు అన్నీ తమకు మద్దతిస్తాయనే భరోసా
తోనే బిజెపి ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం అన్యాయం చేయడానికి వెనుకాడటం లేదని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని, అమిత్ షా ప్రకటనలపై వైసీపీ, టీడీపీ, జనసేనలు
స్పందించే సాహసం కూడా చేయలేవని వీరి మౌనమే రాష్ట్రంలో బిజేపి బలంగా
భావిస్తున్నదనీ కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నారు.