తల్లిపాల ప్రాధాన్యం అందరికీ తెలుసు. బిడ్డ ఎదుగుదలలో అవి ఎంతో కీలకం. కొందరు
పసిపిల్లలు వివిధ కారణాలతో తల్లిపాలకు దూరమవుతుంటారు. ఇలాంటి ఎంతోమంది పిల్లల
ఆకలి తీర్చిందో మాతృమూర్తి. నవజాత శిశువులకు తన చనుబాలు దానం చేసిన ఆమె
సహృదయానికి గిన్నిస్ రికార్డూ జోహారులంది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన
ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. తన బిడ్డలకు పాలు
పట్టడంతోపాటు 2015 నుంచి 2018 మధ్యలో 1,600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు
విరాళంగా అందించిన ఆమెకు గిన్నిస్ గుర్తింపు లభించింది. ‘‘నా భర్తది
ప్యూర్టెరికో కావడంతో ఓసారి ఆ ద్వీపానికి వెళ్లాను. ప్రసవ సమయంలో తల్లిని
కోల్పోయిన ఓ బిడ్డకు అక్కడ పాలిచ్చాను. తర్వాత అలాగే కొనసాగించాను’’ అని
సియెర్రా తెలిపారు. హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా ఆమెకు పాలు ఎక్కువగా
ఉత్పత్తి అయ్యేవి. ఇలా తనలోని లోపంతోనూ ఎందరో చిన్నారుల ఆకలి తీరిందన్నారు.