న్యూఢిల్లీ : రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్
దేశాభివృద్ధికి బలమైన పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రం
ప్రవేశపెట్టిన బడ్జెట్ సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుందని
తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.
రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నవ భారత అభివృద్ధికి
బలమైన పునాది అని అన్నారు. ఈ బడ్జెట్ సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రాధాన్యం
ఇస్తుందని చెప్పారు. పన్నుల ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని ప్రధాని
నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రైతులు,
మధ్యతరగతి ప్రజల కలలను నెరవేరుస్తుంది. మౌలిక వసతుల కల్పనలో మునుపెన్నడూ లేని
విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధికి వేగం, కొత్త
శక్తి లభిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.