టెక్సాస్, ఫ్లోరిడాల్లో నలుగురి మృతి..పలువురికి గాయాలు
పెర్రిటన్ : అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం
సృష్టించాయి. టెక్సాస్‌లోని పెర్రిటన్ పట్టణంలో టోర్నడో ధాటికి ముగ్గురు
మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఫ్లోరిడాలో అదే రోజు రాత్రి ఒకరు
మరణించారు. టెక్సాస్‌లో భారీగా ఆస్తినష్టం జరిగింది. సుమారు 200 గృహాలు, 30
వరకు సంచార గృహ వాహనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. టోర్నడో ధాటికి భారీ
వృక్షాలు నెలకొరిగాయని, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెప్పారు.
మరోవైపు సుడిగాలి తీవ్రతకు టెక్సాస్, ఒక్లహామాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో
సుమారు 50 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు ఓ వెబ్సైట్
పేర్కొంది.